Breaking News

మోడీ బయోగ్రఫీ రిలీజ్

మోడీ బయోగ్రఫీ రిలీజ్

-ఇంటర్ నెట్‌లో రిలీజ్‌ చేసిన రిటైర్డ్‌ జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ చిన్ననాటి ఫొటోలు, ఆయన గురించి ఎవరికి తెలియని విషయాలను తెలియజేస్తూ రూపొందించిన మోడీ బయోగ్రఫీని రిటైర్డ్ జస్టిస్‌ కేజీ. బాలకృష్ణన్‌ రిలీజ్‌ చేశారు. ‘నరేంద్ర మోడీ.. హర్బింజర్‌ ఆఫ్‌ ప్రాస్ పెరిటీ అండ్‌ అపాస్టిల్‌ ఆఫ్‌ వరల్డ్‌ పీస్‌’ పేరుతో ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఇంటర్ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్ జ్యురిస్ట్‌ అండ్‌ ఛైర్మన్‌ ఆఫ్ ఆల్‌ ఇండియా బార్‌‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్ అగర్వాలా ఈ పుస్తకానికి కోఆథర్‌‌గా వ్యవహరించారు.

అమెరికాకు చెందిన రచయిత్రి, కవయిత్రి ఎలిసాబెత్‌ హోరన్‌ కూడా కూడా ఈ పస్తకం రాయడంలో సహకారం అందించారు. మన దేశంలో మోడీ ఆరేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా దీన్ని రిలీజ్‌ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటర్ నెట్‌ ద్వారా విడుదల చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ పుస్తకం రెండు ఫార్మెట్లలో దొరుకుతుందని అగర్వాలా చెప్పారు. మొత్తం 20 భాషల్లో దీన్ని తీసుకొచ్చారు.