సారథి న్యూస్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు నిషేధిత మావోయిస్ట్ పార్టీ కమిటీ సభ్యులను ఆదివారం గ్రామస్తులు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట సరెండర్ చేయించారు. వారిలో కోరం నాగేశ్వర్రావు, కొమరం రమేష్ , సొందే రమేష్, కోరం సత్యం, ఇర్పా వెంకటేశ్వర్లు, వాగే కన్నారావు ఉన్నారు. ఇకపై మావోయిస్టులకు సహకరించేది లేదని గ్రామస్తులంతా స్వచ్ఛందంగా తీర్మానం చేశారు.
- May 31, 2020
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- CHARLA
- MAOIST
- భద్రాద్రి కొత్తగూడెం
- మావోయిస్టులు
- Comments Off on మావోయిస్టు కమిటీ సభ్యుల సరెండర్