బీజింగ్: శిక్షణ శిబిరం నిబంధలను ఉల్లంఘించిన ఆరుగురు ఫుట్‌బాల్ ప్లేయర్స్‌పై చైనీస్ ఫుట్‌బాల్ సంఘం (సీఎఫ్ఐ) కొరడా ఝుళిపించింది. ఆర్నెళ్ల పాటు ఎలాంటి మ్యాచ్‌ల్లో ఆడకుండా నిషేధం విధించింది. 35 మందితో కూడిన జాతీయ అండర్–19 జట్టుకు షాంఘైలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటుచేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాత్రిపూట బయటకు వెళ్లొద్దని షరతు విధించారు. కానీ దీనిని తుంగలో తొక్కిన ఆరుగురు ఫుట్‌బాల్ క్రీడాకారులు.. మద్యం కోసం అర్ధరాత్రి బయటకు వచ్చారు. దీనిని గుర్తించిన అధికారులు కఠిన చర్యలకు దిగారు. ‘వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఇది చాలా కఠిన నిబంధన. దీనిని ప్లేయర్లు ఉల్లంఘించారు. ఇది క్షమించరానిది. వాళ్లు చేసిన తప్పిదం వల్ల టీమ్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే వాళ్లపై నిషేధం విధించాం’ అని సీఎఫ్ఐ పేర్కొంది.
- June 8, 2020
- క్రీడలు
- BEIJING
- CHINIES FOOTBALL
- ఫుట్‌బాల్
- షాంఘై
- Comments Off on మందు కోసం వెళ్లి.. సస్పెన్షన్‌కు గురై