Breaking News

ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్

ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ ​జిల్లా చిన్నశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కోవిడ్​–19 వ్యాక్సినేషన్ పై ఏఎన్ఎం,ఆశా వర్కర్లకు మెడికల్ ఆఫీసర్ శ్రావణి శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాక్సిన్​ను మొదట ఫ్రంట్ లైన్ వారియర్స్ హెల్త్, పోలీస్, శానిటేషన్ సిబ్బందికి, తర్వాత 60 ఏళ్లు పైబడిన, మరియు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు, అలాగే 50 ఏళ్లు పైబడిన వారికి, చివరగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ చేయాలన్నారు. హెల్త్ సిబ్బంది వ్యాక్సినేషన్ చేయించుకునే వారి వివరాలు ఆన్ లైన్​లో రిజిస్టర్ చేస్తారని చెప్పారు. మొదటి డోస్ ఇచ్చిన 28 రోజులకు రెండో డోస్ ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యాదగిరిరావు, పీహెచ్ఎన్ శాంతిశ్రీ, సూపర్​వైజర్​ శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.