కోల్కతా: ఇండియా ఫుట్ బాల్ మాజీ ఆటగాడు చున్నీ గోస్వామి గురువారం సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. గత కొన్నేళ్లుగా మధుమేహం, నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కలకత్తాలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశాడు.
ఆయనకు భార్య, కుమారుడు ఉన్నాడు. 1956–64 మధ్య ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన గోస్వామి 50 మ్యాచ్ లూ ఆడాడు. 1962 ఆసియా క్రీడల్లో భారత్ ను విజేతగా నిలపడంతో గోస్వామి పేరు మార్మోగిపోయింది. ఫుట్ బాల్ తో పాటు క్రికెట్ పై మక్కువ చూపే గోస్వామి కొన్ని ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు కూడా ఆడాడు.