సారథి న్యూస్, చేవెళ్ల: లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు బిర్యానీ ప్యాకెట్లు, ఒక్కొక్కరికి నాలుగు గుడ్ల చొప్పున దాదాపు వెయ్యి మందికి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు. ప్రజాసమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పేదలను అన్ని విధాలుగా మేలుచేస్తుందన్నారు.
ప్రజలెవరూ ఆకలి చావులతో ఉండకూడదని ధైర్యం ఇచ్చారు. పోలీసు సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.