Breaking News

ధోనీ.. నంబర్​వన్​

మాజీ బ్యాట్స్​ మెన్ మహ్మద్ కైఫ్

న్యూఢిల్లీ: టీమిండియాలోకి ఎంతమంది వికెట్​ కీపర్లు వచ్చినా.. మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేరని మాజీ బ్యాట్స్​ మెన్ మహ్మద్ కైఫ్ అన్నాడు. ఫిట్​ నెస్, కీపింగ్ విషయంలో అతన్ని తలపించేవారు లేరన్నాడు. అందుకే ఇప్పటికీ మహీయే నంబర్​వన్​ కీపర్ అని చెప్పాడు. ‘ఐపీఎల్​తో పునరాగమనం చేద్దామని ధోనీ భావించాడు. కానీ అది వాయిదా పడింది. కానీ నా దృష్టిలో అది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే ధోనీ చాలా పెద్ద ఆటగాడు. తిరుగులేని మ్యాచ్ విన్నర్. ఆరు, ఏడు స్థానాల్లో ఉండే ఒత్తిడిని అధిగమించి మ్యాచ్​లను గెలిపించడమంటే మామూలు విషయం కాదు. ధోనీ చాలా అలవోకగా ఆడేస్తాడు. ఇప్పటికైనా అతన్ని మించిన ప్లేయర్ ఎవరూ లేరు. రాహుల్​ ను బ్యాకప్ కీపర్​గానే చూసుకోవాలి. పూర్తి బాధ్యతలు పెడితే ఇబ్బందులు వస్తాయి’ అని కైఫ్ వ్యాఖ్యానించాడు. కొంత మంది క్రికెటర్లకు ప్రత్యామ్నాయాలు దొరికినా.. ధోనీకి దొరకడం కష్టమన్నాడు. రిషబ్ పంత్, సంజూ శాంసన్​లో మహీని అందుకునే సత్తా, సామర్థ్యం లేవని స్పష్టం చేశాడు. అందుకే తొందరపడి ధోనీని టీమ్​ కు దూరం చేయకూడదని చెప్పుకొచ్చాడు.