సారథి న్యూస్, హుస్నాబాద్: మానవ తప్పిదాలతోనే తరచూ రోడ్డు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ అన్నారు. రోడ్డుపై వెళ్తుంటే ఏమాత్రం ఏమరపాటు మరిచినా ప్రమాదమేనని హెచ్చరించారు. హుస్నాబాద్ డివిజన్ లోని హుస్నాబాద్, కోహెడ, చేర్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన రోడ్ యాక్సిడెంట్ ప్రదేశాలను బుధవారం ఆయన అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించకుండా అతివేగంతో నడపడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. స్పీడ్ లేజర్ గన్ ద్వారా వేగం నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు 100 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. అధికారుల బృందంలో ఆర్టీవో రామేశ్వర్ రెడ్డి, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, ఆర్ అండ్ బీ జేఈ సాజిత్, పంచాయతీ రాజ్ జేఈ రాజేందర్ రెడ్డి, హెచ్ కే ఆర్ కంట్రోల్ అసిస్టెంట్ మేనేజర్ వెంకట్ రెడ్డి, హుస్నాబాద్, చేర్యాల సీఐలు శ్రీనివాస్, రఘు ఉన్నారు.
- June 3, 2020
- మెదక్
- లోకల్ న్యూస్
- HUSNABAD
- ROAD ACCIDENTS
- ట్రాఫిక్ ఏసీపీ
- రోడ్డు యాక్సిడెంట్స్
- Comments Off on తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు