సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. నాగార్జున సిమెంట్ సంస్థ వారు అందజేసిన బారికేడ్లను గురువారం ఆయన ప్రారంభించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ మురళీధర్, ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి, సీఐలు చిట్టిబాబు, కరుణాకర్, శ్రీధర్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
- May 28, 2020
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- KHAMMAM
- TRAFFIC
- ఖమ్మం పోలీస్ కమిషనర్
- నాగార్జున సిమెంట్
- Comments Off on ట్రాఫిక్ సమస్యకు ఇక చెక్