- న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్
వెల్లింగ్టన్: కరోనాదెబ్బకు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన క్రికెట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ అన్నాడు. ఇందుకోసం కొత్త పద్ధతులను అలవాటు చేసుకోవాలన్నాడు. ఖాళీస్టేడియాల్లో క్రికెట్ ఆడేందుకు అందరూ అలవాటుపడాలని చెప్పాడు. తద్వారా ఆటతో పాటు ఆటగాళ్లు కూడా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతారన్నాడు. ‘ఈ గడ్డుకాలం నుంచి బయటపడడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఖాళీ స్టేడియాల్లో, ఫ్యాన్స్ లేకుండా క్రికెట్ ఆడడం అలవాటు చేసుకోవాలి. తగిన జాగ్రత్తలతో బరిలోకి దిగితే వైరస్ తో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు’ అని నీషమ్ వ్యాఖ్యానించాడు.