Breaking News

కరోనా సమాచారం చెప్పేస్తుంది

  • యాప్​ను లాంచ్‌ చేసిన సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని హాస్పిటల్‌ బెడ్స్‌, వెంటిలేటర్లు, కరోనా పేషంట్ల సమాచారం తదితర అంశాలను తెలుసుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం కొత్త యాప్‌ను లాంచ్‌ చేసింది. ‘ఢిల్లీ కరోనా’ పేరుతో రూపొందించిన యాప్‌ను సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రారంభించారు. దేశ రాజధానిలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు దీన్ని రూపొందించినట్లు అధికారులు చెప్పారు. ‘ప్రతి ఒకరికి హాస్పిటల్స్‌, బెడ్లు, వెంటిలేటర్ల సమాచారం ఇచ్చేందుకు మేం యాప్‌ను లాంచ్‌ చేశాం’ అని కేజ్రీవాల్‌ అన్నారు. ఈ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌‌లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. యాప్‌ లేని వారు delhifightscorona.in/beds ద్వారా సమాచారం తెలుసుకోవచ్చన్నారు. దీంట్లో డేటా ఉదయం 10 గంటలకు ఒకసారి, సాయంత్రం 6 గంటలకు ఒకసారి అప్‌డేట్‌ చేస్తారని అన్నారు.