- ఆర్‌సీబీ డైరెక్టర్ మైక్‌హెస్సన్
ముంబై: కరోనా దెబ్బకు ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడినా చాలా మందికి లీగ్‌పై నమ్మకం పోలేదు. ఈ ఏడాది ఏదో ఓ టైమ్‌లో కచ్చితంగా ఐపీఎల్ జరిగి తీరుతుందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్‌హెస్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. లీగ్ ఎప్పుడు జరిగినా ఆర్‌సీబీ రెడీగా ఉంటుందన్నాడు. ‘మాకు ఇంకా నమ్మకం ఉంది. ఐపీఎల్‌కు టైమ్ ముగిసిపోలేదు. కచ్చితంగా జరిగి తీరుతుంది. పరిస్థితులను సమీక్షించిన తర్వాత బీసీసీఐ దీనిపై కచ్చితమైన నిర్ణయానికి వస్తుంది. లీగ్ ఎప్పుడు జరిగినా మేం బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాం. మా ప్లేయర్లకు కూడా ఇదే చెప్పా. ఇప్పటికైతే లీగ్ జరుగుతుందనే మేం మానసికంగా సిద్ధమయ్యాం’ అని హెస్సన్ వ్యాఖ్యానించాడు.
హైల్త్ క్రైసిస్‌ను దృష్టిలో పెట్టుకుని సరైన సమయంలో కఠినమైన చర్యలు తీసుకున్నారన్నాడు. ఐపీఎల్ కోసం తమ ప్లానింగ్ అంతా కరెక్ట్‌గానే సాగుతోందన్నాడు. ప్రతిఒక్కరూ తమ పనుల్లో నిమగ్నమయ్యారని చెప్పుకొచ్చాడు. షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి మే 24 వరకు ఐపీఎల్ జరగాల్సి ఉంది.