సారథి న్యూస్, మహబూబాబాద్: గృహమే కదా స్వర్గసీమ! అన్న పెద్దలమాటను ఆచరించి ప్రతిఒక్కరూ తమ ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధుల బారినపడకుండా క్షేమంగా ఉండాలని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిరిజన సంక్షేమ, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఇంట్లోని కిచెన్, హాల్, కిటికీలు, ఫ్రిజ్, ఆవరణలోని వరండాలను ఆమె శుభ్రంచేశారు. మంత్రి కేటీఆర్ పిలుపుతో తాను కూడా ఇంటిని శుభ్రం చేసుకున్నానని వివరించారు. ఆరోగ్య తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
- June 7, 2020
- లోకల్ న్యూస్
- వరంగల్
- MAHABUBABAD
- SATYAVATHIRATHOD
- కేటీఆర్
- క్లీన్ అండ్ గ్రీన్
- పరిశుభ్రత
- Comments Off on ఇంటి నుంచే క్లీన్ అండ్ గ్రీన్