![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/rahul.jpg?fit=400%2C400&ssl=1)
న్యూఢిల్లీ: తెలుగు కుర్రాడు, స్టార్ వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్.. ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డు రేస్‌లో నిలిచాడు. ఇతనితో పాటు మీరాబాయ్ చానూ, పూనమ్ యాదవ్ పేర్లను వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ఈ ఏడాది పురస్కారాలకు సిఫారసు చేసింది. 2018 కామన్వెల్త్లో స్వర్ణం సాధించిన 23 ఏళ్ల రాహుల్.. జూనియర్ విభాగాల్లోనూ చాలా పతకాలు గెలిచాడు.
రెండుసార్లు కామన్వెల్త్ చాంపియన్‌షిప్ సాధించాడు. అయితే క్రీడల్లో అత్యున్నత పురస్కారం ‘ఖేల్‌రత్న’ను 2018లోనే అందుకున్న మీరాబాయ్ను అర్జునకు ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది. 25 ఏళ్ల మీరా 2017లో వెయిట్ లిఫ్టింగ్ వరల్డ్ చాంపియన్ షిప్ సొంతం చేసుకుంది. మరోవైపు కామన్ వెల్త్ సీనియర్ కేటగిరీలో రజతం నెగ్గిన పూనమ్ యాదవ్.. గోల్డ్ కోస్ట్ కామన్ వెల్త్‌లో స్వర్ణం గెలిచింది. 2015లో సతీష్ శివలింగం తర్వాత ఇప్పటిదాకా వెయిట్ లిఫ్టర్లు ఎవరు కూడా అర్జున అవార్డును అందుకోలేదు.