Breaking News

అప్పుడే వదిలేద్దామనుకున్నాడు


న్యూఢిల్లీ: ఫామ్ లేకపోవడం, సరైన బ్యాటింగ్ స్థానం దొరకపోవడంతో 2007లోనే దిగ్గజ బ్యాట్స్​మెన్ సచిన్ టెండూల్కర్ కెరీర్​ గుడ్ బై చెప్పాలనుకున్నాడని టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్​స్టెన్​ వెల్లడించాడు. అప్పటికే తీవ్ర అసంతృప్తిలో ఉన్న మాస్టర్​కు వన్డే ప్రపంచకప్ నుంచి భారత్ లీగ్ దశ నుంచి నిష్ర్కమించడం మరింత భారంగా మారిందన్నాడు. ‘నేను బాధ్యతలు చేపట్టేనాటికి భారత జట్టులో పరిస్థితులు బాగాలేవు. వాటిని అధిగమించడానికి కాస్త సమయం పట్టింది. కానీ అప్పటికే ప్రయోగాల వల్ల ఆటగాళ్లంతా మానసికంగా చాలా కుంగిపోయి ఉన్నారు. సరైన బ్యాటింగ్ స్థానం లేకపోవడంతో సచిన్ రిటైర్మెంట్ ఆలోచనలు చేశాడు. విండీస్ నుంచి భారత్​కు తిరిగి రాగానే ప్రకటించాలని అనుకున్నాడు’ అని కిర్​స్టెన్ పేర్కొన్నాడు.

ఒకవేళ ఆ సమయంలో సచిన్ ఆటకు గుడ్​ బై చెబితే.. ఓ గొప్ప ప్లేయర్​తో కోచింగ్ ప్రయాణాన్ని మిస్ అయ్యేవాడినన్నాడు. అయితే అప్పుడు మాస్టర్​కు ఎలాంటి కోచింగ్ ఇవ్వలేదని, కేవలం అతను పుంజుకోవడానికి అవసరమైన వాతావరణాన్ని మాత్రమే కల్పించానన్నాడు. అంతే మూడేళ్ల కాలంలో సచిన్ 19 అంతర్జాతీయ సెంచరీలు చేశాడని గుర్తుచేశాడు. ఆటపై అతనికి ఉన్న అవగాహన, నైపుణ్యానికి కోచింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు.