Breaking News

సచినే నా ఫేవరెట్

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్

ముంబై: ఇప్పటితో పోలిస్తే అప్పట్లో వన్డే ఫార్మాట్ లో నిబంధనలు చాలా కఠినంగా ఉండేవని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అందుకే ఈ ఫార్మాట్​లో విరాట్ కంటే సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ ఆటగాడని చెప్పాడు. ఇప్పటికీ వన్డేల్లో మాస్టర్​ ను ఢీకొట్టే మొనగాడే లేడన్నాడు. ‘సచిన్ ఆడే సమయంలో నిబంధనలు చాలా కఠినంగా ఉండేవి. ఒకటే వైట్ బంతి, 30 యార్డ్ సర్కిల్​లో నలుగురు, బయట ఐదుగురు ఫీల్డర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఇప్పుడున్న క్రికెట్ మొత్తం బ్యాట్స్​ మెన్​కు అనుకూలంగా మారింది. ప్రతి ఇన్నింగ్స్​లో రెండు కొత్త బంతులు. బయట నలుగురు ఫీల్డర్లే ఉంటున్నారు. దీనివల్ల బ్యాట్స్​ మెన్ ఈజీగా పరుగులు సాధిస్తున్నాడు. మూడు పవర్​ ప్లే నిబంధనలు కూడా బ్యాట్స్​ మెన్​ కే అనుకూలంగా ఉన్నాయి. కొత్త బాల్స్, రివర్స్ స్వింగ్, ఫింగర్ స్పిన్ మచ్చుకైనా కనిపించడం లేదు. కఠిన నిబంధనలు ఉన్నా.. సుదీర్ఘకాలం ఈ ఫార్మాట్​లో ఆడడం వల్ల సచినే తన ఫేవరెట్ అని తెలిపాడు. అప్పట్లో 230, 240 పరుగులు చేస్తే అలవోకగా గెలిచేవాళ్లమన్నాడు.