న్యూఢిల్లీ: భారత్‌లో ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. విదేశాలకు తరలించడంపై బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. తమ ముందున్న చివరి ప్రత్యామ్నాయం అదేనని బోర్డు వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. అయితే ఇప్పటికీ తమ మొదటి ప్రాధాన్యం మాత్రం భారతే అని స్పష్టం చేశాయి. ‘మాకు అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాం. క్రికెటర్ల ఆరోగ్యానికి ఇబ్బందులు లేకుండా ఉండి, ప్రభుత్వం అనుమతి ఇస్తే లీగ్ ఇక్కడే జరుగుతుంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించని పక్షంలో, సరైన విండో లభిస్తే విదేశాలకు తరలించే ఆలోచనల్లో కూడా ఉన్నాం. ఇది మాకున్న ఏకైక చివరి అవకాశం’ అని బోర్డు వర్గాలు స్పందించాయి. అయితే ఐపీఎల్ నిర్వహణ మొత్తం టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ తీసుకునే తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని వెల్లడించాయి. కాబట్టి లీగ్‌పై పూర్తిస్పష్టత రావాలంటే ఈనెల 10 వరకు ఆగాల్సిందేనన్నాయి. ఐపీఎల్ జరగకపోతే దాదాపు 4 వేల కోట్ల నష్టం వస్తుందనే ఆందోళనలో ఉన్న బీసీసీఐ.. ఎలాగైనా టోర్నీ జరపాలని చాలా పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
- June 5, 2020
- క్రీడలు
- BCCI
- IPL
- టీ20 ప్రపంచకప్
- లీగ్
- Comments Off on అదే లాస్ట్ చాన్స్