సారథి, మానవపాడు(గద్వాల): వపర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ న్యాయవాది పాత్రలో నటించిన వకీల్‌సాబ్ సినిమా విడుదల సందర్భంగా ఆయన అభిమానులు రచ్చ రచ్చ చేశారు. థియేటర్ లో గందరగోళం సృష్టించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస టాకీస్ లో శుక్రవారం వకీల్ సాబ్ సినిమా మొదటి ఆట శాటిలైట్ ద్వారా ప్రారంభమైంది. సినిమా షురూ అయిన కొద్దిసేపటికే అర్ధాంతరంగా ఆగిపోవడంతో పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహించారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులై కుర్చీలు, తలుపులను విరగొట్టారు. మళ్లీ సినిమా స్టార్ట్ కావడంతో కాస్త శాంతించారు.
- April 9, 2021
- Archive
- Top News
- gawdala
- PAVANKALYAN
- VAKILSAB
- గద్వాల
- పవన్ కళ్యాణ్
- వకీల్‌సాబ్
- Comments Off on ‘వకీల్‌సాబ్’ ఫ్యాన్స్ రచ్చరచ్చ.. ఎందుకో తెలుసా?