Breaking News

సిద్దిపేట జిల్లాలో సూపర్‌ స్ప్రెడర్లకు వాక్సిన్

సిద్దిపేట జిల్లాలో సూపర్‌ స్ప్రెడర్లకు వాక్సిన్

సారథి సిద్దిపేట: చౌకధరల దుకాణాల డీలర్లు, వర్కర్లు, ఎల్ పీజీ, పెట్రోల్ బంక్ డీలర్లు, వర్కర్లు, ఎరువులు, పంట క్రిమి సంహారక మందుల డీలర్లు, విత్తనాల డీలర్లు, జర్నలిస్టులు కొవిడ్ బారినపడకుండా, ఇతరులకు వ్యాప్తిచేసేందుకూ ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. జిల్లాలో వీరికి ఈ నెల 28, 29, 30 తేదీల్లో వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. లాక్ డౌన్ నేపథ్యంలో వాక్సిన్ వేసుకునేందుకు వీరికి అనుమతులు ఇవ్వాలని పోలీసులకు తెలియజేస్తామన్నారు. తప్పనిసరిగా డీలర్, వర్కర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు తీసుకెళ్లాలన్నారు. జర్నలిస్టు అయితే ఆధార్ కార్డుతో పాటు అక్రిడేషన్ కార్డు కూడా తమ వెంట తీసుకువెళ్లాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరీశ్, జిల్లా ప్రజాసంబంధాల అధికారి మామిండ్ల దశరథం, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.