Breaking News

వట్టెంలో త్రిపుర గవర్నర్ పూజలు

వట్టెంలో త్రిపుర గవర్నర్ పూజలు

సామాజికసారథి, బిజినేపల్లి: త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మంగళవారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారికి మాజీఎంపీ పి.రాములు, సీనియర్ నాయకులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, జనుంపల్లి రాంచంద్రారెడ్డి, సేవికాసమితి విభాగ్ కార్యవాహిక బి.దేదీప్యశ్రీ, బుసిరెడ్డి శకుంతల, నాగర్ కర్నూల్ నియోజకవర్గం రెడ్డి సేవాసమితి అధ్యక్షుడు ద్యాసాని లింగారెడ్డి, క్యాడెట్ బి.సాయిసుధాంశురెడ్డి తదితరులు పాల్గొన్నారు.