Breaking News

నకిలీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు

నకిలీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు

సారథి, చొప్పదండి: రైతులకు వానాకాలం సీజన్ నేపథ్యంలో ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్ హెచ్చరించారు. సోమవారం ఆయన చొప్పదండి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం కొనుగోళ్లలో ఏఈవోల కృషిని అభినందించారు. ప్రైవేట్ వ్యక్తులు రైతులకు విత్తనాలు ఇచ్చి ధాన్యం కొనకుండా వదిలేసి ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో స్వరూప, మండల వ్యవసాయాధికారి వంశీకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ రాముడు, ఆర్ఐ సుజాత, సూపరింటెండెంట్ వేణుగోపాల్, ఏఈ ఓలు ప్రసన్న కుమార్ రెడ్డి, అనిల్ రెడ్డి, రాజశేఖర్ పాల్గొన్నారు.