Breaking News

కల్వకుర్తికి చేరిన రేవంత్​రెడ్డి యాత్ర

కల్వకుర్తికి చేరిన రేవంత్​రెడ్డి పాదయాత్ర

సారథి న్యూస్, కల్వకుర్తి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర నాలుగవ రోజు బుధవారం నాగర్​కర్నూల్ ​జిల్లా కల్వకుర్తికి చేరింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. శ్రీశైలం, జూరాల, పులిచింతల, శ్రీరాంసాగర్​, కల్వకుర్తి, నెట్టెంపాడు, దుమ్ముగూడెం ప్రాజెక్టులను కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారని గుర్తుచేశారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి చల్లా వంశీచందర్ రెడ్డి యాత్రలో ఆయన వెంట నడిచారు. మాడ్గుల, వెల్దండ, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాల నుంచి కాంగ్రెస్​నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రేవంత్ రెడ్డితోనే సాధ్యమని’ నినాదాలు చేశారు.

రేవంత్​రెడ్డి రోడ్​షోకు హాజరైన కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు