Breaking News

ప్రణాళికలు సిద్ధం చేయాలి

ప్రణాళికలు సిద్ధం చేయాలి

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: లక్ష్యం మేరకు జిల్లాలో మొక్కలు నాటేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన చాంబర్లో  జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ 2022 నుంచి  2024 సంవత్సరం వరకు మూడేళ్లపాటు జిల్లాలో వివిధ శాఖల ద్వారా నాటాలల్సిన మొక్కల లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లాలో 2022 సంవత్సరంలో 46.06 లక్షల మొక్కలు, 2023లో  40.76 లక్షలు, 2024 సంవత్సరంలో 35.46 లక్షల మొక్కలు నాటాల్సిందున్నదన్నారు. ఈ సమావేశంలో అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శ్రీనివాస్ రావు, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, సంక్షేమ శాఖల అధికారులు, పశుసంవర్ధక,  ఉద్యాన శాఖ, విద్య,  పోలీస్, అగ్నిమాపక, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.