Breaking News

MLC Elections: 14 ఓట్లకు .. 21మంది సిబ్బందికి ఎన్నికల డ్యూటీ

సామాజికసారథి, నాగర్ ‌కర్నూల్ బ్యూరో: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు నాగర్ కర్నూల్ జిల్లాలో అత్యంత పకడ్బందీ మధ్య జరిగాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిఓటూ విలువైందే. అయితే జిల్లాలోని తిమ్మాజిపేట మండల పోలింగ్ కేంద్రంలో మొత్తం 14 ఓట్లకు 13 పోలయ్యాయి. 14 ఓట్లకు గాను స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రానికి 21 మంది సిబ్బందిని నియమించారు. పాఠశాలకు కూడా సెలవిచ్చారు. టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తహసీల్దార్, పోలీసుశాఖ, వైద్యశాఖ అధికారులు పరిశీలించారు. 13 ఓట్ల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు లక్షల రూపాయలు ఉంటుందని పలువురు చర్చించుకోవడం కనిపించింది. ఈ సెంటర్ ను మరోసెంటర్ లో కలిపి పోలింగ్ నిర్వహిస్తే ప్రజాధనం వృథా అయ్యేది కాదన్న అభిప్రాయం స్థానికుల నుంచి వ్యక్తమైంది .