Breaking News

నాడు వేధించారు.. నేడు పంచన చేరారు!

నాడు వేధించారు.. నేడు వంచన చేరారు!
  • బీఆర్ఎస్ నేతల మైండ్ గేమ్
  • కాంగ్రెస్ నేతలను వేధించి అధికార నాయకుడితో ఫొటోలు?
  • హస్తం శ్రేణుల్లో రగులుతున్న అసంతృప్తి
  • నాగర్​ కర్నూల్​ నియోజకవర్గంలో హాట్​ పాలిటిక్స్​

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: అధికారం కోల్పోయిన బీఆర్​ఎస్​ నేతలు మైండ్​ గేమ్​ షురూ చేశారు. అడ్డగోలు వ్యవహారాలతో ‘ఛీ’ అనిపించుకుంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ కార్యకర్తలను ముఖ్యంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అనుచరులను తీవ్రంగా వేధించారు. ఎన్నో ఏండ్ల తర్వాత నాగర్ కర్నూల్ నియేజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా డాక్టర్ రాజేశ్​ రెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల సుదీర్ఘనిరీక్షణ ఫలించింది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అనుచరులుగా ఉంటూ అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటూ వచ్చారు. రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ పాలనకు చరమగీతం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. దీంతో కరుడుగట్టిన పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇన్నాళ్లూ తాము కోల్పోయిన ఆనందం దక్కించుకోవాలని తహతహలాడుతున్న సమయంలో బీఆర్ఎస్ లో ఛీకొట్టినా కొందరు తనదైన శైలిలో మైండ్ గేమ్ ప్రారంభించారన్న అనుమానాలు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నారు. ఇన్నాళ్లూ మర్రి జనార్దన్ రెడ్డి కోటరీ గా ఉంటూ ఆయన అండదండలతో రెచ్చిపోయి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయించారు. వీరు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు డాక్టర్ రాజేశ్​ రెడ్డి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేశారు. అయినా కాంగ్రెస్ కార్యకర్తల పట్టుదలతో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా డాక్టర్ రాజేశ్​ రెడ్డి సంచలన విజయం సాధించారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దీనిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరి మైండ్ గేమ్ మొదలుపెట్టారు. పార్టీ కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్​ రెడ్డి నియోజకవర్గంలో ఏదైనా కార్యక్రమానికి వస్తే చుట్టూ చేరి తమదే గొప్ప అన్నస్థాయిలో ఫొటోలకు ఫోజులు ఇస్తుండటం కాంగ్రెస్ కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. తమను వేధించిన వారే ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చుట్టూ చేరడంపై కాంగ్రెస్ లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వలసవాదులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అక్రమ కేసులు బనాయించినా..!
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పార్టీలోకి తీసుకోకపోయినా ఎన్నోసార్లు మీలాంటి వారు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు అన్ని చెప్పిన వినకుండా ఫొటోలకు పోజులు ఇచ్చి వాట్సాప్ గ్రూపులోకి పెట్టి మండల అధికారులతో తాను ఎమ్మెల్యే మనిషినే అనుపించుకున్నారని ఈ విషయం డాక్టర్ రాజేశ్​ రెడ్డి దృష్టికి తెచ్చి వారో తామో తేల్చుకోవాలని గొడవకు దిగుతున్నారు. గతంలో వారు పెట్టిన వేధింపులు గుర్తుచేస్తున్నారు‌. అనూహ్యంగా ఇలాంటి పరిస్థితి శనివారం బిజినేపల్లిలో ఎదురుకావడంతో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సైతం విలవిల్లాడుతున్నారు. నాగర్ కర్నూల్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం గల కీలకనేతగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డికి పెరుంది. బీఆర్ఎస్ వేధింపుల నుంచి తన అనుచరులను తప్పించేందుకు ఆయనే బీఆర్ఎస్ లో చేరారు. తన కేడర్ ను కాపాడుకుంటూ వచ్చారు. అయితే అదే పార్టీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాత్రం దామోదర్ రెడ్డి ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ముమ్మరంగా యత్నించారు. దామోదర్ రెడ్డి అనుచరులపై అక్రమకేసులు బనాయించారు. బీఆర్ఎస్ లో ఉన్నా ఎమ్మెల్సీగా పనిచేస్తున్న దామోదర్ రెడ్డి పెత్తనం సాగకుండా అప్పటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నిరంతరం పనిచేశారు. దామోదర్ రెడ్డి వర్గంపై అక్రమ కేసులు నమోదు చేయించారు. దీంతో వీరు పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ వచ్చారు. పోలీసులు చుట్టూ తిరుగుతూ వచ్చారు. ఇందుకు కారణం ఆయన వారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్​ రెడ్డి అనుచరులుగా చెప్పుకోవడం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులలో ఆవేదన కలుగుతోంది. వీరు డాక్టర్ రాజేశ్​ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో ముందుండి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను పక్కకు తోస్తుండటంతో ఇదంతా ఓ పథకం ప్రకారం జరుగుతోందని డాక్టర్ రాజేశ్​ రెడ్డికి చెప్పి అలాంటి వీరిని దగ్గర పెట్టుకుంటే పార్టీ నష్టపోతుందని అంటున్నారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు ఆడిస్తున్న నాటకమని ఆరోపిస్తున్నారు. దీంతో నాగర్ కర్నూల్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *