Breaking News

బీజేపీ పాలనకు స్వప్తి పలుకుదాం

బీజేపీ పాలనకు స్వప్తి పలుకుదాం
  • మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి

సారథి, వెల్దండ: దేశవ్యాప్తంగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ పాలనకు స్వప్తి పలకాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం పెట్రోల్, డీజిల్ అధిక ధరల పెంపునకు నిరసనగా ఏఐసీసీ పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఎం.మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ.. పెట్రోల్ ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి వర్గాలను నడ్డివిరుస్తున్నారని మండిపడ్డారు. ఆదాని, అంబాని కంపెనీలకు అప్పనంగా దేశసంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు.

హక్కుల కోసం రోడ్డెక్కిన రైతులపై లాఠీచార్జి చేస్తున్నారని, ఉపాధి కోసం ఉద్యమించే యువతపై ఉక్కుపాదం మోపుతున్నారని, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని, ప్రశ్నించే మేధావులపై రాజ్యద్రోహం కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షుడు పర్వత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి శేఖర్, సింగిల్ విండో డైరెక్టర్లు వెంకటయ్య గౌడ్, నరేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణాఅధ్యక్షు నాగేశ్వర్ గౌడ్, యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పుల్లయ్య, యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాఘవేందర్, కొండల్, ఆంజనేయులు, శివ నాయక్, జైరాంనాయక్, రామకృష్ణ, రాజునాయక్, చెన్నయ్య పాల్గొన్నారు.