Breaking News

మైనార్టీల అభ్యున్నతికి కృషి

మైనార్టీల అభ్యున్నతికి కృషి

సారథి ప్రతినిధి, రామగుండం: రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్​ కృషి చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం రంజాన్ పండగను పురస్కరించుకుని మసీద్ ఇమామ్ లు, సదర్లు, మతపెద్దలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పండుగ వేళ ముస్లింలకు కానుకలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్​కే దక్కిందన్నారు. రెసిడెన్షియల్​ స్కూళ్లను ఏర్పాటుచేసి ఉచితంగా చదువులు అందిస్తున్నారని కొనియాడారు.
కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, జడ్పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటర్లు ఎన్ వీ రమణారెడ్డి, బాల రాజ్ కుమార్, జహీద్ పాషా, సలీంబేగ్, సీరాజోద్దిన్, సత్తార్ ఖాన్, మత పెద్దలు అబ్దుల్ రహమన్, అక్రం, మునవర్, జమల్, మహ్మద్, రహీం, సత్తార్ ఖాన్ పాల్గొన్నారు.

ఐసొలేషన్​ సెంటర్​ ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్

ప్రజలంతా ధైర్యంగా ఉండాలి
కరోనా నుంచి ప్రజలంతా ధైర్యంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. ప్రజలందరికీ తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. సోమవారం గోదావరిఖని పట్టణంలోని సప్తగిరికాలనీలో ఐసొలేషన్​ సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కొవిడ్ బాధితుల కోసం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో 50 పడకల ఆక్సిజన్ బెడ్ ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజలంతా మాస్క్​ లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. కార్యక్రమంలో నగర మేయర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, నాయకులు కాల్వ శ్రీనివాస్ పాల్గొన్నారు.