Breaking News

సీసీ కెమెరాల ఏర్పాటు భేష్​

సీసీ కెమెరాల ఏర్పాటు భేష్​

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా ఎస్పీ మనోహర్​ మంగళవారం వెల్దండ పోలీస్​స్టేషన్​ను ఆకస్మికంగా సందర్శించారు. ఎస్సై నర్సింహులును అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. పోలీస్​స్టేషన్​కు వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, వాటి సత్వర పరిష్కారం చూసి ప్రశంసించారు. రికార్డులను పరిశీలించి భేష్ ​అని కితాబు ఇచ్చారు. సీసీ కెమెరాలను ఏర్పాటుకు చూపిన ప్రత్యేక చొరవను చూసి ఎస్సైని ప్రత్యేకంగా అభినందించారు. గార్డెనింగ్, స్టేషన్ ​ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ప్రశంసలు కురిపించారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలు అదుపు చేయొచ్చని ఎస్పీ మనోహర్ అన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, ఇసుక మాఫియా, దొంగతనాలు తగ్గాయని పేర్కొన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలో దాతల సహకారంతో దాదాపుగా వందకు పైగా సీసీ కెమెరాలను అమార్చామని, మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు సహకరించాలని ఎస్సై నర్సింహులు వివరించారు. సీసీ కెమెరాలు జిల్లా ఎస్పీ ఆఫీస్ నుంచి, స్టేట్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తే ఇక్కడేం జరుగుతుందో ఈజీగా తెలుసుకోవచ్చని తెలిపారు. ఇంతకుముందు స్టేషన్​లో క్రైమ్ రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట కల్వకుర్తి డివిజన్ డీఎస్పీ గిరిబాబు, స్థానిక ఎస్సై నర్సింహులు లతోపాటు సిబ్బంది తదితరులు ఉన్నారు.