Breaking News

76 మంది జవాన్లకు గాయాలు



ఢిల్లీ: లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 76 మంది ఇండియన్​ ఆర్మీ జవాన్లు గాయపడ్డారని సంబంధిత అధికారులు ప్రకటించారు. గాయపడినవారిలో 18 మంది లేహ్‌లోని హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారని, వారు 15 రోజుల్లో డ్యూటీలో చేరే అవకాశం ఉందన్నారు. కాగా మిగిలిన 56 మంది వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని, వారంతా రెండు వారాల్లో తిరిగి విధులకు హాజరవుతారని పేర్కొన్నారు. జూన్‌ 15 అర్ధరాత్రి తర్వాత గాల్వన్‌‌ లోయలోని పెట్రోల్‌ పాయింట్‌ 14 వద్ద భారత బలగాలపై చైనా సైనికులు రాళ్లు, ఇనుప రాడ్లు, కట్టెలతో విక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఇందులో కల్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారతీయ సైనికులు మృతిచెందారు. ఈ ఘర్షణలో చైనాకు చెందిన సైనికులు సుమారు 45 మంది చనిపోయి ఉండొచ్చని భారత ఆర్మీ ప్రకటించింది. అయితే మృతుల సంఖ్యను చైనా అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.