Breaking News

7200 మంది ఖైదీల రిలీజ్‌

7200 మంది ఖైదీల రిలీజ్‌
  • మహారాష్ట్ర సర్కార్‌‌ ఉత్తర్వులు

పుణె: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జైళ్లలో రద్దీని తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 7,200 మంది ఖైదీలను రిలీజ్‌ చేసింది. మరో 10వేల మందిని రిలీజ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. వాళ్లందరినీ టెంపరరీ బెయిల్‌, పెరోల్‌ మీద పెట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఏడేళ్ల వరకు శిక్షపడ్డ ఖైదీలను టెంపరరీగా వదిలిపెట్టామన్నారు.

‘లాక్‌ డౌన్‌కు ముందు రాష్ట్రంలోని 60 జిల్లాల్లో 35వేల మంది ఖైదీలు ఉన్నారు. ఇప్పటివరకు 7,200 మందిని రిలీజ్‌ చేశాం. మొత్తం మీద 17వేల మందిని టెంపరరీ బెయిల్‌పై రిలీజ్‌ చేస్తాం. దీని కోసం హైలెవల్‌ కమిటీని నియమించాం’ అని అధికారులు చెప్పారు. ముంబైలోని ఆర్థర్‌‌ రోడ్‌ జైలులో 100 మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఈ డెసిషన్‌ తీసుకున్నామన్నారు. ఆ జైలు నుంచి దాదాపు 700 మంది ఖైదీలను విడుదల చేశారు. ప్రస్తుతం అక్కడ 1,572 మంది ఖైదీలు ఉన్నారు