సారథి న్యూస్, రామడుగు: వానకాలం పంట సాగు ప్రణాళిక, నియంత్రిత వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి యాస్మిన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాలు క్లస్టర్ల వారీగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 26న రామడుగు, శానగర్, 27న గోపాల్ రావుపేట్, రుద్రారం, 28న వెలిచాల, దేశరజ్ పల్లి గ్రామాల్లో నిర్వహిస్తామని చెప్పారు. రైతులు తప్పకుండా హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- May 25, 2020
- కరీంనగర్
- షార్ట్ న్యూస్
- AGRICULTURE
- RAMADUGU
- కరీంనగర్
- పంటసాగు ప్రణాళిక
- Comments Off on 26 నుంచి పంటసాగు ప్రణాళికలు