Breaking News

హ్యాపీ బర్త్ డే టు విశాల్

హ్యాపీ బర్త్ డే టు విశాల్

తెలుగు అబ్బాయి అయిన విశాల్ తమిళనాట హీరోగా రాణించడం చెప్పుకోదగిన విషయం. ఇరుప్రాంతాల్లోనూ అభిమానులను సొంత చేసుకున్న విశాల్ ఈసారి ‘చక్ర’ సినిమాతో ఫ్యాన్స్ ను అలరించనున్నాడు. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో పాన్​ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్ రెజీనా క‌సాండ్ర, మ‌నోబాల, రోబోశంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే రీసెంట్​గా రిలీజైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి బజ్ వినిపించింది. విశాల్ పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు. ఆయన పవర్ ఫుల్ మాస్ లుక్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. హీరో విశాల్ సూప‌ర్ హి‌ట్ మూవీ ‘అభిమ‌న్యుడు’ త‌ర‌హా బ్యాంక్ రాబ‌రీ, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్తమ సాంకేతిక విలువ‌ల‌తో కొత్త క‌థ, క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంది. అయితే ఈ రోజు బర్త్ డే సందర్భంగా రిలీజైన పోస్టర్ సినిమా అంచనాలను పెంచేదిగా ఉంది. రిలీజ్ వచ్చే నెలలో ఉండొచ్చని ఫిల్మ్ నగర్ టాక్.