సారథి న్యూస్, వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ను కల్వకుర్తి ఆర్డీవో రాజేష్ కుమార్ గురువారం సందర్శించి ఆస్పత్రి భవన స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరిందని తెలియడంతో స్థానిక తహసీల్దార్ సైదులుతో కలిసి ఆయన పరిశీలించారు. ఒకవేళ ఆస్పత్రిని మార్చితే స్థానిక అనుకూలమైన భవనాలను కలియ తిరిగి చూశారు.