Breaking News

హీరోయిన్ల ఫోన్లలో నగ్న వీడియోలు, నీలిచిత్రాలు

హీరోయిన్ల ఫోన్లలో నగ్న వీడియోలు, నీలిచిత్రాలు

సుశాంత్ డెత్ కేసు కాస్తా డ్రగ్స్ కేసుగా మారింది. టోటల్ సినిమా ఇండస్ట్రీలోనే కలకలంగా మారిన ఈ నార్కొటిక్స్ కలవరం మరో దారి పడుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ డ్రగ్స్ కేసులో సెక్స్ రాకెట్ కోణం కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన గల్రానీల మొబైల్ ఫోన్ల నుంచి అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. ఇద్దరి మొబైల్ ఫోన్ల ద్వారా కొత్తగా సెక్స్ రాకెట్ కోణం బయటపడినట్లు సీసీబీ వర్గాల సమాచారం. వారి మొబైల్ ఫోన్స్ లో నగ్న వీడియోలు, నీలిచిత్రాలు ఉన్నట్లు సీసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని సీసీబీ నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పుడీ కేసు కొత్త మలుపు తిరగనుంది.

ఇద్దరి మొబైల్ ఫోన్లలో ఈ వ్యవహారం కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఉందని.. డ్రగ్స్ కేసు బయటపడగానే ఆ గ్రూపును డిలిట్ చేశారని సీసీబీ వర్గాల సమాచారం. కాగా డ్రగ్స్ కేసుపై ఫోకస్ పెట్టిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. తమ అదుపులో ఉన్న డ్యాన్సర్ కిశోర్ శెట్టి ఇచ్చిన సమాచారం మేరకు కెంగేరి, నైజీరియాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరు ముంబై, గోవాల నుంచి డ్రగ్స్​తెచ్చి మంగళూరులో అమ్ముతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా డ్రగ్స్ కేసులో రాగిణి ద్వివేది, సంజన గల్రానీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సస్ యాక్ట్ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేస్తూ వారిద్దరికీ బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించిందట. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరికొందరి బెయిల్ పిటిషన్లను కోర్టు ఈరోజు విచారించనుంది.