న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో ఉంటే చాలా మెరుగ్గా ఉంటుందని ఆ దేశ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అన్నాడు. దీనివల్ల టీమ్‌లో సమతూకం వస్తుందన్నాడు. ‘పాండ్యా అదనపు బ్యాట్స్‌మెన్, బౌలర్‌గా ఉపయోగపడతాడు. దీనివల్ల భారత్‌కు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అదనపు బౌలర్‌గా పాండ్యా సేవలు చాలాకీలకం. ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలంటే మూడో పేసర్‌గా పనికొస్తాడు. అతను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే పంత్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించవచ్చు. అప్పుడు పంత్‌పై బ్యాటింగ్ ఒత్తిడి ఉండదు’ అని చాపెల్ విశ్లేషించాడు. మరోవైపు స్పిన్నర్ల ఎంపికలో సెలెక్టర్లకు పరీక్ష తప్పదన్నాడు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రతిఒక్కరూ రాణిస్తున్నారని కితాబిచ్చాడు. అయితే రికార్డుల పరంగా అశ్విన్ ముందంజలో ఉన్నా ఆసీస్‌లో అతని పేలవమైన రికార్డు మైనస్‌గా మారనుందన్నాడు.
- June 8, 2020
- క్రీడలు
- ASWIN
- CHAPEL
- HARDIKPANDYA
- ఆస్ట్రేలియా
- టీమిండియా
- రిషబ్‌పంత్
- Comments Off on హార్దిక్ ఉండడమే బెటర్