సారథి న్యూస్, చేవెళ్ల: వికారాబాద్ జిల్లా చేవెళ్ల నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం మే వేడుకలు ఘనంగా జరిగాయి. చేవెళ్లలో ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు కె.రామస్వామి కార్మిక జెండాను ఎగరవేశారు. శ్రమను నమ్ముకుని జీవిస్తున్న ప్రతి కార్మికుడు తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రతి కార్మికుడికి వేతనం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్డె సత్యనారాయణ, మండల కార్యదర్శి సుధాకర్ గౌడ్, ఎండీ మక్బుల్, కృష్ణయ్యగౌడ్, వి.శివయ్య, ఎం.శంకర్, కృష్ణ, మల్లారెడ్డి, బడ్ల కృష్ణ పాల్గొన్నారు.