కరాచీ: పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ బ్యాన్ అప్పీల్ కేసును విచారించేందుకు స్వతంత్ర విచారణాధికారిని నియమించారు. ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ జడ్జీ ఫకీర్ మహ్మద్ ఖోకర్.. ఈ కేసును విచారిస్తారని పీసీబీ వెల్లడించింది. విచారణ తేదీని ఆయనే నిర్ణయిస్తారని తెలిపింది. ఇప్పటికే తన తరఫున వాదనలు వినిపించేందుకు.. ప్రధాని పార్లమెంట్ అఫైర్స్ సలహాదారు బాబన్ అవాన్‌కు చెందిన న్యాయసంస్థను ఉమర్ ఆశ్రయించాడు. ఈ కేసులో తన తప్పులేదని తేలుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) సందర్భంగా బుకీలు తనను కలిసిన విషయాన్ని దాచిపెట్టడంతో.. పీసీబీ ఉమర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఏ ఫార్మాట్‌లో ఆడకుండా మూడేళ్ల నిషేధం విధించింది. దీనిపై ఉమర్ అప్పీల్‌కు వెళ్లాడు. అక్టోబర్‌లో పాక్ తరఫున చివరి మ్యాచ్ ఆడిన ఉమర్.. తన కెరీర్‌లో 16 టెస్ట్‌లు, 121 వన్డేలు, 84 టీ20ల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాడు.
- June 1, 2020
- క్రీడలు
- PAKISTAN CRICKET
- UMAR
- ఉమర్ అక్మల్
- పాకిస్థాన్ క్రికెటర్
- పాకిస్థాన్ సూపర్ లీగ్
- Comments Off on స్వతంత్ర జడ్జీతో ఉమర్ కేసు