సైక్లింగ్ వరల్డ్ గవర్నింగ్ బాడీ చర్యలు
పారిస్: కొలంబియా సైక్లిస్ట్ జెర్లిన్‌సన్ పాంటానోపై సైక్లింగ్ వరల్డ్ గవర్నింగ్ బాడీ కొరడా ఝుళిపించింది. డోపింగ్‌లో పట్టుబడ్డందుకు అతనిపై నాలుగేళ్ల బ్యాన్ విధించింది. గతేడాది జరిగిన డోపింగ్ టెస్ట్‌లో అతను బ్లడ్ బూస్టర్ ఈపీవో తీసుకున్నట్లు తేలింది. 2019 ఫిబ్రవరిలో అవుట్‌ఆఫ్ కాంపిటీషన్‌లో భాగంగా ఈ శాంపిల్స్‌ను సేకరించారు. అప్పటి నుంచి ప్రొవిజనల్ సస్పెన్షన్‌లో ఉన్న 31ఏళ్ల పాంటానోపై అధికారికంగా చర్యలు తీసుకున్నారు. 2016 టూర్‌డి ఫ్రాన్స్ టైటిల్‌ను గెలిచిన పాంటానో గత జూన్‌లోనే స్పోర్ట్స్‌కు గుడ్‌బై చెప్పాడు. 2017లో కొలంబియా టైమ్ ట్రయల్ చాంపియన్‌గా నిలిచిన పాంటానో.. టూర్ ఆఫ్ స్విట్జర్లాండ్, టూర్ ఆఫ్ కెటలోనియా టైటిల్‌ను కూడా సాధించాడు.