Breaking News

సేతుపతి ఫస్ట్ లుక్

సేతుపతి ఫస్ట్ లుక్..

సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పిజ్జా’ తెలుగు అనువాద చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు విజయ్. కేవలం హీరోగానే కాకుండా నటుడిగా ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తూ స్టార్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. పిజ్జా సినిమా తర్వాత విజయ్ నుండి చాలా సినిమాలే తెలుగులోకి అనువాదమై రిలీజ్ అయ్యాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసి.. ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగారు ఆయన. గతేడాది మెగాస్టార్ ‘సైరా నరసింహరెడ్డి’ సినిమాలో తనదైన నటనతో మెప్పించాడు.

విజయ్ సేతుపతి తాజాగా నటిస్తున్న సినిమా ‘తుగ్లక్ దర్బార్’. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం సోషల్ మీడియాలో తుగ్లక్ దర్బార్ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. మంచి ఇంటెన్సిటీ లుక్​తో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో విజయ్ సరసన అతిథిరావు హైదరి, మంజిమ మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను లలిత్ కుమార్ నిర్మిస్తుండగా.. ఢిల్లీ ప్రసాద్ దీన్ దయాళ్​ దర్శకత్వం వహిస్తున్నాడు. గోవింద్ వసంత్ సంగీతాన్ని అందిస్తున్నాడు.