Breaking News

సెబాస్టియన్ కోరిక..

సెబాస్టియన్ కోరిక..

‘రాజావారు రాణివారు’మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. సినిమా హిట్ తో వెంటనే ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మూవీతో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ‘సెబాస్టియన్’గా వస్తున్నాడు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నమ్రతాదారేకర్, కోమలీ ప్రసాద్ హీరోయిన్స్. శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రమోద్ రాజు నిర్మాత. జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. రేచీకటి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను రీసెంట్ గా లావణ్య త్రిపాఠి విడుదల చేసింది. తెరిచి ఉన్న గేటు ఆవరణలోంచి చర్చ్ కనిపిస్తుంది. చర్చ్​లో మొదట జీసస్ కనిపిస్తాడు. తర్వాత కిరణ్ అబ్బవరం నడుచుకుంటూ పోలీస్ గెటప్ లో ఫోన్ మాట్లాడుకుంటూ నడుస్తుంటాడు. బ్యాక్​గ్రౌండ్ స్కోరులో ‘ఓ తల్లికి న్యాయం జరగడం కోసం మరో తల్లి చేసిన ప్రామిస్‌.. నిజం ఎప్పటికీ దాగదు..’ వంటి కోట్స్‌ రివీల్ అయ్యాయి. ఇంతలో కిరణ్ ‘దయగల ప్రభువా! ఈ రోజు తొందరగా తెల్లారేటట్టు చూడవా! ఆమెన్..’ అంటూ చెప్పే డైలాగ్ తో హీరో దేనికోసమో ఆతృతగా ఎదురుచూస్తున్నాడని అర్థమవుతోంది. ఫస్ట్ గ్లింప్స్ తోనే ఆకట్టుకుంటూ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నారు మేకర్స్.