ఢిల్లీ: సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 12 వతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు మొత్తం 11,92,961 మంది హాజరుకాగా 88 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోబ్రియాల్ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. పరీక్షాఫలితాలను cbseresults.nic.inలో చూడవచ్చు. గత ఏడాది 83.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 5.38శాతం అధిక ఉత్తీర్ణత నమోదైంది. త్రివేండ్రంలో అత్యధికంగా 97.67 శాతం మంది, బెంగళూరులో 97.05 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బీహార్ రాజధాని పాట్నాలో అత్యల్పంగా 74.57 శాతం ఉత్తీర్ణత నమోదైంది.