సారథి న్యూస్, మహబూబ్ నగర్: పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీ, మర్లు, నలంద ఆటోస్టాండ్ ప్రాంతాల్లో పర్యటించారు. డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నాలాలు, రోడ్లపై చెత్తాచెదారం వేయకుండా పట్టణవాసులు చూసుకోవాలన్నారు. మంత్రి వెంట కలెక్టర్ ఎస్.వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ మోహన్ లాల్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ సురేందర్ ఉన్నారు.
- June 1, 2020
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- MUNCIPAL
- PALAMUR
- పారిశుద్ధ్యం
- వి.శ్రీనివాస్‌గౌడ్
- స్పెషల్ డ్రైవ్
- Comments Off on సీజనల్ వ్యాధులపై జాగ్రత్త