Breaking News

సీఎఫ్ వో ఇప్పుడే వద్దు

బీసీసీఐ నిర్ణయం

న్యూఢిల్లీ: కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ వో)ను ఇప్పుడే నియమించలేమని బీసీసీఐ సంకేతాలిచ్చింది. భారీవేతనం ఇవ్వాల్సి ఉండడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో బోర్డు దానిని భరించలేదన్ని వెల్లడించింది. గతంలో సీఎఫ్‌వోగా పనిచేసిన సంతోష్‌ రంగ్నేకర్‌.. వ్యక్తిగత కారణాలతో ఆరుక్రితం రాజీనామా చేశాడు. అప్పట్నించి ఈ పోస్ట్‌ ఖాళీగా ఉంది. ‘సీఎఫ్‌వోను ఇప్పుడు నియమించలేం. కొత్త రాజ్యాంగం ప్రకారం కూడా ఇదేమీ తప్పనిసరికాదు.

బోర్డుకు కచ్చితంగా సీఈవో ఉండాలన్నది నిబంధన. సీఎఫ్‌వో ఉండాల్సిన అవసరం ఉందని ఎక్కడా చెప్పలేదు’ అని బీసీసీఐ సీనియర్‌ ఆఫీసర్‌ ఒకరు వెల్లడించాడు. గతంలో కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీవోఏ) సంతోష్‌ను సీఎఫ్‌వోగా నియమించారు. ట్రెజర్‌ హక్కులను కూడా ఈయనకే కట్టబెట్టింది.. ‘ఇప్పుడు ప్రతి స్పోర్టింగ్‌ బాడీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అరుణ్‌ ధుమాల్‌ కోశాధికారిగా బాగానే పనిచేస్తున్నాడు. ఒకవేళ అతనికి అవసరం అనుకుంటే అప్పుడు ఆలోచిస్తాం. సీఈవో కూడా ఇదే చెబుతున్నాడు’ అని సదరు అధికారి తెలిపారు.