సారథి న్యూస్, మహబూబ్ నగర్: నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ రెమో రాజేశ్వరి హెచ్చరించారు.
శుక్రవారం జిల్లాకేంద్రంలోని తన క్యాంపు ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సామాజిక దూరం పాటించడం ద్వారానే వ్యాధిని అరికట్టవచ్చన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. పోలీసులు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ‘మీకు సహకారం అందిస్తున్న మీ కుటుంబసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నా..’ అని అన్నారు.
- April 24, 2020
- లోకల్ న్యూస్
- ఎస్పీ
- కరోనా
- మహబూబ్ నగర్
- Comments Off on సామాజిక దూరం పాటించాలె