Breaking News

సమంత.. అస్సలు మాట్లాడదట!

సమంత.. అస్సలు మాట్లాడదట!

చిరునవ్వు తో మెస్మరైజ్ చేయడం, అభినయంతో అందరినీ ఫిదా చేయడం సమంతకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఎవరూ ఊహించని రీతిలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోయింది. ‘రంగస్థలం’లో లక్ష్మి పాత్రలో కొంటెగా కవ్వించింది.. ‘మజిలీ’ లో మంచి భార్యగా మెప్పించింది.. ‘ఓ బేబీ’లో 20 ఏళ్ల ఆడపడుచుగా అందరినీ అలరించింది. ఇలా ప్రయోగాత్మక పాత్రల్లో నటించి మెప్పించే సామ్ ఇప్పుడు ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ లో టెర్రరిస్ట్ గా నెగిటివ్ రోల్లో కనిపించనుంది. అయితే మరో ప్రయోగం ఏమిటంటే సమంత మూగ అమ్మాయిగా నటించబోతోందట.

‘గేమ్ ఓవర్’ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సమంత మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. థ్రిల్లర్ ఎంటర్ టైనర్​గా రానున్న ఈ సినిమాలో మాటలు రాని అమ్మాయిలా కనిపించనుందట. విమెన్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని ద‌ర్శకుడు అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ తెరకెక్కించనున్నారు. ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడి చేయనున్నారు.