Breaking News

సత్తన్న అందుకే అలా..

సత్తన్న అందుకే అలా..

సారథి న్యూస్, హైదరాబాద్: బుల్లితెర రియాలిటీ హిట్ షో బిగ్​బాస్​హౌస్​లోకి బిత్తిరి సత్తి వెళ్లనున్నారా.. అందుకే తాను పనిచేస్తున్న చానెల్​లో ఉద్యోగానికి రాజీనామా చేశారా.. అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. తీన్మార్​ వార్తల ద్వారా బిత్తిరి సత్తిగా సుపరిచితుడైన చేవెళ్ల రవికుమార్ బిగ్​బాస్ ​సీజన్​4లో పాల్గొనున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు ప్రముఖ యాంకర్, గాయని మంగ్లీ, హీరో త‌రుణ్‌, యాంక‌ర్ వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్‌, సీరియ‌ల్ న‌టుడు అఖిల్ సార్థిక్​ బిగ్​బాస్ ​హౌస్​లో సందడి చేయనున్నట్లు తెలిసింది. అయితే ఈసారి వ్యాఖ్యతగా ప్రిన్స్​మహేశ్​బాబు వ్యవహరించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆయనకు టైం కుదరకపోతే అక్కినేని నాగార్జున సందడి చేయనున్నట్లు తెలిసింది.