– ప్రకటించిన మధ్యప్రదేశ్‌సీఎం
భోపాల్: టెన్త్ క్లాస్‌బోర్డ్‌ఎగ్జామ్స్ పై మధ్యప్రదేశ్‌ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వాయిదాపడ్డ పదవ తరగతి పరీక్షలను రద్దుచేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఇంతకుముందు పెట్టిన ఎగ్జామ్స్‌ఆధారంగా మార్కులు ఇవ్వనున్నట్లు చెప్పారు. దాని ప్రకారమే జాబితాను ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. వాయిదాపడ్డ పరీక్షలకు సంబంధించి ‘పాస్’ రిమార్క్తో మార్క్‌షీట్‌ఇవ్వనున్నారు. కాగా.. జూన్‌నుంచి 16 వరకు 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పటికే 5 నుంచి 8 వ తరగతి వరకు పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసింది.