సారథి న్యూస్, గోదావరిఖని: పొలాల్లో గడ్డికి మంటలు అంటుకోవడంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్సై రాజేష్ కానిస్టేబుల్ తిరుపతితో కలిసి చాకచక్యంతో ఆర్పివేశారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణ శివారులోని పెద్ద కెనాల్ పరిసర పొలాల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి సుమారు కి.మీ.మేర వ్యాపించాయి. రోడ్డుపై అటుగా వెళ్తున్న ఎస్సై, కానిస్టేబుల్, స్థానికుల సహాయంతో గంటపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. సమీపంలో కోళ్లఫారాలు ఉండడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
- May 22, 2020
- లోకల్ న్యూస్
- SI RAJESH
- SULTHANABAD
- కెనాల్
- పెద్దపల్లి
- Comments Off on శభాష్ పోలీస్