Breaking News

వైభవంగా క్రిస్మస్​ వేడుకలు

వైభవంగా క్రిస్మస్​ వేడుకలు

సారథి న్యూస్, నెట్ వర్క్: క్రిస్మస్ ​వేడుకలు శుక్రవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. క్రైస్తవులు ఉదయం చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నారులు, మహిళలు, పెద్దలతో ఇంటింటా కోలాహలం నెలకొంది. వరంగల్​, కరీంనగర్​, మహబూబ్​నగర్​, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో ఉన్న చర్చీల్లో ప్రార్థనలు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మెదక్ చర్చిలో శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు తొలి ఆరాధనతో క్రిస్మస్ సెలబ్రేషన్స్​ఘనంగా ప్రారంభమయ్యాయి. బిషప్ రెవరెండ్ ఏసీ సాల్మన్ రాజ్ భక్తులకు దేవుని వాక్యం వినిపించారు. మెదక్​ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ములుగు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. వాజేడు, వెంకటాపురం మండలాల్లో క్రిస్మస్ సందడి నెలకొంది. ప్రపంచ మోక్షప్రదాత ఏసుక్రీస్తు పుట్టిన రోజును భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆటాపాటలతో బెత్లెహేములో సందడి.. అంటూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు క్రైస్తవులకు విషెస్​చెప్పారు. పలువురు చర్చీల్లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఏసు చూపిన ప్రేమ, దయ, కృప అందరికీ మార్గదర్శకమని కొనియాడారు. అందరూ ఆ దారిలో నడవాలని క్రైస్తవ మతపెద్దలు పిలుపునిచ్చారు.

మెదక్​లో కేక్​ కట్​ చేస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి
మెదక్​ జిల్లాలో క్రిస్మస్​ వేడుకలకు హాజరైన క్రైస్తవులు
మెదక్​ చర్చీకి తరలివస్తున్న క్రైస్తవులు
మెదక్​ చర్చీ ఆవరణలో కొవ్వొత్తులు వెలిగించి కొబ్బరి కాయలు కొడుతున్న భక్తులు
మెదక్​ జిల్లా పెద్దశంకరంపేటలో కేక్​ కట్​ చేస్తున్నఎంపీపీ జంగం శ్రీనివాస్​
ములుగు జిల్లా వాజేడులో క్రిస్మస్​ సంబరాల్లో మహిళలు, యువతులు
మహబూబ్​ నగర్​ జిల్లా మదనాపూర్​ మండలం దుప్పల్లిలో క్రిస్మస్​ సంబరాలు
మెదక్​లో క్రిస్మస్​ సంబరాల్లో సందేశమిస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి