–రికార్డు ఛేజింగ్ లో ఆడిన బ్యాట్
కేప్ టౌన్: కరోనా నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు కూడా ముందుకొస్తున్నారు. తమ వంతుగా ఎంతో కొంతసాయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ హెర్షల్ గిబ్స్ తన బ్యాట్ ను వేలం వేయనున్నాడు. అయితే ఇది సాధారణ బ్యాట్ కాదు.
వన్డేల్లో ప్రపంచ రికార్డు ఛేజింగ్ లో ఆడిన బ్యాట్. 14 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా నిర్దేశించిన 435 పరుగుల టార్గెట్ ను సఫారీ టీమ్ ఒక బంతి మిగిలి ఉండగానే ఛేజించింది. ఈ మ్యాచ్ లో గిబ్స్ 175 (111 బంతుల్లో 21 ఫోర్లు, 7 సిక్సర్లు) రన్స్ చేసి కీలకపాత్ర పోషించాడు. ఆనాటి విధ్వంసకర ఇన్నింగ్స్ ను జ్ఞాపకంగా ఉంచుకున్న ఆ బ్యాట్ ను ఇప్పుడు వేలానికి పెట్టాడు. ఇక డివిలియర్స్ కూడా తనకు అత్యంత ఇష్టమైన జెర్సీని వేలం వేయనున్నాడు.